Breaking News

నేను అప్పుడే వార్నింగ్‌ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 07/21/2023 - 17:05

I warned you guys in 1984 and you didn't listen: కెనడియన్ చలనచిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏఐ వేగవంతమైన విస్తరణ ప్రమాదాల గురించి 1984లోను తాను హెచ్చరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'ది టెర్మినేటర్'  మూవీలో దీనికి సంబంధించి ఒక హెచ్చరికగా పనిచేసి ఉండవలసిందన్నారు.న్యూస్‌ హౌస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో విపరీతమైన ఏఐ వాడకం విపత్తు పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం  చేశారు.   (ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు)

కొంతమంది పరిశ్రమ నాయకులు  భయపడుతున్నట్టుగా మానవాళి అంతరించిపోవడానికి కారణమయ్యే కృత్రిమ మేధస్సు  గురించి అడిగినప్పుడు, కచ్చితంగా తనకు కూడా ఆందోళన  ఉందన్నారు. వాస్తవానికి  దీనిపై  1984లోనే  హెచ్చరించాను కానీ మీరే వినలేదని పేర్కొన్నారు. తన సెన్సేషనల్‌ మూవీ 'ది టెర్మినేటర్' గురించి ప్రస్తావించిన కామెరూన్‌ ఇది స్కైనెట్ అని పిలువబడే తెలివైన సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్‌నెటిక్ హంతకుడు చుట్టూ తిరుగుతుంది కదా అని గుర్తు చేశారు. 

దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. అణు ఆయుధ పోటీకి సమానమైన పోటీ ఇదని భావించారు. మనం మిన్నకుంటే ఇతరులు దూసుకొస్తారనే పోటీ మధ్య ఇది మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధభూమిలో ఏఐ గురించి ప్రస్తావించిన కామెరూన్  కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి, మానవులు జోక్యం చేసుకోలేరు, శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ అనే చాన్స్‌ ఉండదు. ఈనేపథ్యంలో  డీ-ఎస్కలేషన్‌పై దృష్టి పెట్టడం అవసరం, కానీ ఏఐ సిస్టమ్‌లు అటువంటి సూత్రాలకు కట్టుబడి ఉంటాయనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏఐకి సంబంధించి కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని , ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లు ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాయి.మనకు తెలియ కుండానే, అన్ని మీడియా , సమాచారంపై పూర్తిగా  పట్టు దక్కించుకోనుందని  పేర్కొన్నారు. 

అలాగే ఓపెన్‌ఏఐ, గూగుల్‌, డీప్‌మైం​డ్‌, టెక్ దిగ్గజాలతోపాటు,  ఈ రంగంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు , వ్యవస్థాపకులతో పాటు, AIతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి, అణు యుద్ధ ప్రమాదాలను పరిష్కరించడంతో సమానంగా ఈ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని కామెరూన్‌   నొక్కి వక్కాణించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)