Breaking News

Hyundai IPO: ఐపీవో బాటలో హ్యుందాయ్.. రూ.27500 కోట్ల సమీకరణ!

Published on Tue, 02/06/2024 - 08:10

న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌ఎంఐఎల్‌)ను స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్‌ఎంఐఎల్‌.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్‌ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్‌ఎంఐఎల్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ రికార్డును అధిగమించే వీలుంది. 

రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్‌ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్‌ఎంఐఎల్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్‌లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)