హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?

Published on Mon, 07/10/2023 - 15:12

Hyundai Exter: భారతీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో భాగంగానే నేడు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ కొత్త మైక్రో ఎస్‌యువి 'ఎక్స్‌టర్' (Exter) లాంచ్ చేసింది. ఈ ఆధునిక మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మొత్తం ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. అవి ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) అండ్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. వీటి ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల వరకు ఉంటుంది. ఆటో ట్రిమ్‌లో టాప్ వేరియంట్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఇప్పటికే కంపెనీ ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 83 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG వెర్షన్‌లో కూడా లభిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ప్రత్యేకమైన డే టైమ్ రన్నింగ్ ల్యాంప్‌, వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ కలిగి సైడ్ ప్రొఫైల్ 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎస్‌యువి పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..)

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది హ్యుందాయ్ నియోస్, ఆరా వంటి వాటిని పోలి ఉంటుంది. ఇందులో 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ బ్లాక్ అండ్ ఆలివ్-గ్రీన్ షేడ్స్‌లో సెమీ-లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీని పొందుతాయి. అంతే కాకుండా ఇందులో సింగిల్-పేన్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉందులో లభిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ భారతీయ విఫణిలో టాటా పంచ్, సిట్రోయెన్ సి3, మారుతి సుజుకి ఇగ్నిస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Videos

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)