Breaking News

హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..

Published on Thu, 05/18/2023 - 15:31

Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్‌టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లాంచ్ టైమ్:
దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. 

డిజైన్ & వేరియంట్స్:
భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్‌చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్‌లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి.  

(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?)

సేఫ్టీ ఫీచర్స్:
ఇటీవల కంపెనీ తన ఎక్స్‌టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడతాయి.

ఇంజిన్:
ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్‌యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం  స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

(ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!)

అంచనా ధర & ప్రత్యర్థులు:
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డెలివరీలు ఆగస్టు నాటికి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంలో మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)