Breaking News

భారత్‌లో ఆల్కజార్ కొత్త వేరియంట్ లాంచ్: త్వరలో డెలివరీలు

Published on Tue, 03/07/2023 - 19:19

హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పుడు ఆల్కజార్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ లాంచ్ చేసింది. ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఆల్కజార్ కొత్త ఇంజిన్ ఆప్షన్‌తో విడుదలవ్వడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 16.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 20.25 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హ్యుందాయ్ కంపెనీ కొన్ని వారాలకు ముందు ఈ ఆల్కజార్ 1.5-లీ టర్బో కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఈ ఇంజిన్ 159 హెచ్‌పి పవర్ 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 1.5 టర్బో మొత్తం నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇవి ఇంటిగ్రేటెడ్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ పొందుతాయి. కంపెనీ ప్రకారం, DCT గేర్‌బాక్స్ 18 కిమీ/లీ, మాన్యువల్ గేర్‌బాక్స్ 17.5 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

(ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా)

కొత్త ఆల్కాజర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది, ఇప్పుడు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా లభిస్తాయి. ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా హెక్టర్ ప్లస్, ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)