Breaking News

హైదరాబాద్‌లో కిసాన్‌ అగ్రి షో

Published on Wed, 02/05/2025 - 17:03

హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. కిసాన్ అగ్రి షో 2025 (KISAN Agri Show 2025) నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. కిసాన్ అగ్రి షో-2025 మూడో ఎడిషన్  ఫిబ్రవరి 7 నుండి  9 వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన సిద్ధంగా ఉంది.

మూడు రోజుల పాటు  ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150  పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి రెండు ఎడిషన్‌లు విజయవంతమైన నేపథ్యంలో మూడవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.

ఈ ఎగ్జిబిషన్‌నలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రి షో విలక్షణ వేదికగా నిలవనుంది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన మార్పిడికి కేంద్రం కానుంది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌