Breaking News

రిటైల్‌ స్థలాల్లోనూ హైదరాబాద్‌ టాప్‌

Published on Sat, 07/26/2025 - 18:06

హైదరాబాద్‌లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకే కాదు రిటైల్‌ స్పేస్‌కు కూడా డిమాండ్‌ అధికంగానే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలోనే అత్యధిక రిటైల్‌ స్పేస్‌ లీజులు మన దగ్గరే ఎక్కువగా జరిగాయి. 2025 క్యూ2లో 8 లక్షల చ.అ. స్థల లావాదేవీలు పూర్తయ్యాయని, దీంతో కలిపి ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం (హెచ్‌1)లో నగరంలో 15 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ లీజులు జరిగాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. గతేడాది హెచ్‌1తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2027 నాటికి నగరంలోకి 28 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ సరఫరా అవుతుందని, ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలంలో సుమారు 17 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ వినియోగంలోకి కూడా వస్తుందని అంచనా వేసింది. – సాక్షి, సిటీబ్యూరో

ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ఫ్యాషన్‌..
ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌(ఎఫ్‌అండ్‌బీ) బ్రాండ్లు ఎక్కువగా రిటైల్‌ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగం వాటా 34 శాతంగా ఉండగా.. ఫ్యాషన్‌ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. ఈ క్యూ2లో కొత్తగా గ్రేడ్‌–ఏ మాల్స్‌ సరఫరా జరగకపోవడంతో మాల్స్‌లో వేకన్సీ రేట్‌ 1.85 శాతంగా ఉంది. ఇక, హై స్ట్రీట్‌ ప్రాంతాలలో రిటైల్‌ స్పేస్‌ అద్దెలకు ఆదరణ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూబ్లీహిల్స్‌ వంటి హై స్ట్రీట్‌లో అద్దెలు 13.6 శాతం మేర పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్‌ ప్రాంతాల్లోనూ రిటైల్‌ అద్దెలు ఆశాజనకంగానే వృద్ధి చెందుతున్నాయి.

హాట్‌స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లి
ఈ ఏడాది రెండో త్రైమాసికం(క్యూ2)లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 22.4 లక్షల చ.అ. రిటైల్‌ స్పేస్‌ లావాదేవీలు పూర్తయ్యాయి. గతేడాది క్యూ2లో జరిగిన 23.9 లక్షల చ.అ. జరిగాయి. ఈ ఏడాది క్యూ1లో 23.7 లక్షల చ.అ.లు జరిగాయి. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వంటి హైస్ట్రీట్‌ ప్రాంతాలలో రిటైల్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 89 శాతం లీజులు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి. బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాలు రిటైల్‌ స్పేస్‌కు హాట్‌ స్పాట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్యూ2లో ఈ ప్రాంతాలలో 57 శాతం లీజులు జరిగాయి. అమీర్‌పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాలలో 43 శాతం రిటైల్‌ స్పేస్‌ లీజులు పూర్తయ్యాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)