Breaking News

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్

Published on Sun, 06/01/2025 - 15:10

సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తి రంగంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీపీ)లకు అడ్డాగా మారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 తొలి త్రైమాసికం(క్యూ1)లో 1.94 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరగగా.. ఇందులో 43 శాతం వాటా జీసీసీలదేనని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

సౌత్‌ జోరు.. 
2025 క్యూ1లో జీసీసీలు 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అదే 2024 క్యూ1లో జరిగిన 48.7 లక్షల చ.అ. జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. అత్యధికంగా దక్షిణాది నగరాలలో 64 శాతం వాటా 53.4 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 19.5 లక్షల చ.అ. లీజులు జరిగాయి. జీసీసీ లావాదేవీల్లో అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగం వాటా 35 శాతం కాగా.. బీఎఫ్‌ఎస్‌ఐ రంగం 22 శాతం, తయారీ, పారిశ్రామిక రంగం వాటా 13 శాతంగా ఉంది.  

  • 100–110 బిలియన్‌ డాలర్లకు.. 
    2024 ముగింపు నాటికి ఏడు నగరాలలో మొత్తం 1,700 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి మార్కెట్‌ విలువ సుమారు 52 బిలియన్‌ డాలర్లు. 

  • ఆయా జీసీసీలలో 17–18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి 2,200–2,300 జీసీసీ సెంటర్లకు చేరుతుందని అంచనా. 

  • వాటి మార్కెట్‌ విలువ 100–110 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. అలాగే ఆయా జీసీసీలలో ఉద్యోగుల సంఖ్య 24–28 లక్షలకు చేరుతుంది.

జీసీసీ అంటే? 
జీసీసీలకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందకొస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్‌ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)