Breaking News

‘రూ.96 లక్షల ఉద్యోగం.. చేరాలా వద్దా?’

Published on Sun, 10/26/2025 - 17:42

ఎంతటి అనుభవం, అవగాహన ఉన్నవారికైనా వృత్తిపరమైన జీవితంలో అనేక సందేహాలు, సందిగ్ధాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ప్రొఫెషనల్‌ కమ్యూనిటీ వేదిక రెడిట్‌లో పంచుకుంటూ సలహాలు కోరుతుంటారు. ఇలాగే హైదరాబాద్‌కు చెందిన టెకీ కూడా తనకు ఎదురైన సందిగ్ధాన్ని షేర్‌ చేశారు.

ఈ హైదరబాద్‌ టెకీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తనకు యూఎస్‌ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్‌ గురించి సబ్‌రెడిట్ (కమ్యూనిటీ గ్రూప్‌) ఇండియన్‌వర్క్‌ప్లేస్‌లో షేర్‌ చేసి ఏం చేయమంటూరు? అంటూ సలహా కోరడంతో ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.

ఆ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగానికి సంవత్సరానికి 1,10,000 డాలర్లు (సుమారు రూ.96.6 లక్షలు) జీతం ఇస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు.. ప్రాజెక్టు ఆధారిత కన్సల్టెన్సీ కాంట్రాక్ట్. ఈ ఆఫర్‌ను తాను పరిశీలిస్తున్నప్పటికీ, పన్ను బాధ్యతలు, ఉద్యోగ భద్రత, అలాగే దీర్ఘకాలిక కెరీర్ ప్రమాదాలు వంటి అంశాలపై అనిశ్చితంగా ఉన్నట్లు టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తాను ఆ ఆఫర్‌ను అంగీకరించాలనుకుంటే, పన్ను ప్రయోజనాలను గరిష్ఠం చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్‌ సలహా తీసుకోవడం, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్‌ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో స్టార్టప్‌ వ్యాపారం విజయవంతంగా పెరిగితే యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చమని కోరే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

ఈ పోస్ట్‌ కొద్ది సమయంలోనే వైరల్‌ అయింది. వందలాది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది ఈ ఆఫర్‌ను ప్రమాదకరంగా పేర్కొంటూ, స్థిరమైన ఉద్యోగాన్ని కొద్దిపాటి జీతం పెరుగుదల కోసం విడిచిపెట్టడం సరైంది కాదని అన్నారు.

మరికొందరు మాత్రం, వృద్ధి చెందుతున్న యూఎస్‌ స్టార్టప్‌లో చేరడం దీర్ఘకాలంలో పెద్ద అవకాశాలను అందించవచ్చని, ముఖ్యంగా యూఎస్‌ రీలొకేషన్‌ సాధ్యమైతే ఇది కెరీర్‌ బూస్టర్‌ అవుతుందని వ్యాఖ్యానించారు. కన్సల్టెన్సీ రోల్‌లో ఉండే ఉద్యోగ భద్రతా లోపం దృష్ట్యా ఈ వేతనం సరిపోదని, మరికొంత కోరాలని మరో యూజర్‌  సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి: ‘కొత్త’ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)