Breaking News

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌.. రైజింగ్‌!

Published on Sat, 03/22/2025 - 15:53

కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్‌ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరో

గత నెలలో గ్రేటర్‌లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది.      

నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్‌’ బంగ్లా అమ్మకం..

వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)