Breaking News

నిర్మాణం.. మరింత భారం

Published on Sun, 06/29/2025 - 15:08

సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్‌ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్‌ రీసెర్చ్‌ తెలిపింది.

టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్‌ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగాయి.

2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్‌ ధరలు 30 శాతం, సిమెంట్‌ 22 శాతం, కాపర్‌ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్‌ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.

ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)