Breaking News

ఆఫీస్‌ స్పేస్‌.. సిటీ టాప్‌ ప్లేస్‌..

Published on Sat, 08/09/2025 - 09:57

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్‌ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం నగర ఆఫీస్‌ మార్కెట్‌ అనూహ్యమైన డిమాండ్‌ను చవిచూసిందని ‘ఎ బిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌ అండ్‌ కౌంటింగ్‌ – ఇండియా ఆఫీస్‌ సప్లై’ నివేదికలో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సంస్థ తెలిపింది. ఈ నివేదిక వెల్లడించిన ఇతర విశేషాల ప్రకారం.. –సాక్షి, సిటీబ్యూరో

ఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యే నాటికి, నగరం మొత్తం ఆఫీస్‌ స్టాక్‌ 123 మిలియన్‌ చదరపు అడుగులు, ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్‌ మార్కెట్‌లో 12% కాగా వార్షికంగా చూస్తే 9.2% అభివృద్ధితో టాప్‌ ఆరు మెట్రో నగరాల్లోనే అత్యధిక వృద్ధిని ప్రదర్శించింది. టెక్‌ రంగంలో బలమైన ప్రగతి, నిరంతరం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదల, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం నగర కార్యాలయ విస్తృతికి దోహదం చేస్తున్నాయి.

టాప్‌ ప్లేస్‌లో ఈ ఏరియాలు..
కొండాపూర్, మణికొండతో సహా సెకండరీ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లు(ఎస్‌బీడీలు) నగర వాణిజ్య కార్యాలయ ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవే మొత్తం కార్యాలయ సముదాయంలో 47% వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రామ్‌గూడ వంటివి 41% వాటాను దక్కించుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ వంటి సంప్రదాయ సెంటర్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లు ఇప్పుడు 11% వాటాను కలిగి ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ వంటి బలమైన మౌలిక సదుపాయాలు తక్కువ కార్యాచరణ ఖర్చులు వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి.

ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..

నాణ్యతలో టాప్‌ 3..
గ్రేడ్‌ ఏగా లెక్కించిన 68% కార్యాలయ సముదాయంతో నగరంలోని ఆఫీస్‌ స్పేస్‌ నాణ్యతపరంగా మొదటి మూడు భారతీయ నగరాల్లో ఒకటిగా ఉంది. నగరంలో గ్రేడ్‌ బీ 30% వాటాను కలిగి ఉండగా, గ్రేడ్‌ సీ కేవలం 1% మాత్రమే ఉండటం గమనార్హం. నగరం కొంత కాలంగా ఐటీ/ఐటీఇఎస్, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), ఫార్మా లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలకు ఆకర్షణీయంగా, అయస్కాంతంలా మారింది. ఇవే ప్రధానంగా లీజింగ్‌ కార్యకలాపాలకు ఊపునిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో, నగరంలోని కీలక టెక్‌ కారిడార్లలో ఫ్లెక్స్‌–ఎనేబుల్డ్‌ వర్క్‌స్పేస్‌లను కోరుకునే బహుళజాతి సంస్థల నుంచి సిటీ బలమైన డిమాండ్‌ను చవి చూసింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)