కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్: రూ.50 లక్షలు మాయం

Published on Wed, 11/06/2024 - 11:22

భారతదేశంలో ఆన్‌లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్‌లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.

స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్‌లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.

ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్‌సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు.

Videos

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)