గృహ విక్రయాలు 21% తగ్గొచ్చు !

Published on Sun, 12/22/2024 - 00:42

న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో డిసెంబర్‌ క్వార్టర్‌లో గృహ అమ్మకాలు 21 శాతం తగ్గి 1.08 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని స్థిరాస్తి డేటా అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ అంచనా వేసింది. ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో (ఎన్‌సీఆర్‌) మాత్రం విక్రయాలు పెరుగుతాయని వెల్లడించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో గృహ విక్రయాల వివరాలను ప్రాప్‌ఈక్విటీ శనివారం విడుదల చేసింది. మొత్తం తొమ్మిది నగరాల్లో 2024 డిసెంబర్‌ క్వార్టర్‌లో 1,08,261 యూనిట్ల ఇళ్లు అమ్ముడు కావొచ్చు.

గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 1,37,225 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే 2024 సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్‌–డిసెంబర్‌ అమ్మకాలు 5% పెరిగే అవకాశం ఉందని వివరించింది. అధిక బేస్‌ ధరల ప్రభావం కారణంగానే క్యూ3లో ఇళ్ల ధరలు తగ్గాయి. పండుగ డిమాండ్‌ కలిసిరావడంతో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాలు పెరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మూలాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉన్నాయని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు సీఈవో సమీర్‌ జసుజా తెలిపారు. 

⇒ హైదరాబాద్‌ పరిధిలో విక్రయాలు 47% తగ్గొచ్చని అంచనా వేసింది. 2023–24 డిసెంబర్‌ త్రైమాసికంలో 24,044 గృహ విక్రయాలు జరిగితే ఈ ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు. 

⇒ బెంగళూరులో 13 శాతం తగ్గి విక్రయాలు 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు. కోల్‌కతాలో అమ్మకాలు 33% తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు దిగిరావచ్చు. 

⇒ ముంబై నగరంలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27% పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13% విక్రయాలు తగ్గొచ్చు. కాగా 2023–24 డిసెంబర్‌ త్రైమాసికంలో 8,607 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 7,478 గృహాలకు పరిమితం కావచ్చు. థానేలో 26,099 యూనిట్ల నుంచి 21,893 యూనిట్లకు పడిపోవచ్చు. పుణేలో ఇండ్ల విక్రయాలు 24 శాతం తగ్గే చాన్స్‌ ఉంది.

⇒ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌ కారణంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో గురుగ్రాం పరిధిలో లగ్జరీ ఇళ్లకు కొన్నేళ్లుగా డిమాండ్‌ అసాధారణ రీతిలో పెరుగుతోంది. 2023–24 డిసెంబర్‌ త్రైమాసికంలో 10,354 గృహ అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య 12,915 ఇళ్ల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. అంటే 25% అమ్మకాలు పుంజుకోవచ్చు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)