Breaking News

అంత తక్కువ వడ్డీ అంటే అనుమానించాలి కదా?

Published on Sat, 07/26/2025 - 15:32

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగర శివార్లలోని తెల్లాపూర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి తాను ముంబైలో ఉంటున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకున్నాడు. ఫిన్‌పెయిర్‌ పేరుతో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి వ్యాపారాభివృద్ధికి రుణం ఇస్తానంటూ ఎర వేశాడు. నమ్మి ముందుకు వచ్చిన నగర వ్యాపారి నుంచి రూ.1.5 కోట్లు స్వాహా చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడు డి.నాగరాజును అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.

తెల్లాపూర్‌ రోడ్డులోని హోనర్‌ వివాంటీస్‌లో నివసించే నాగరాజు ఆన్‌లైన్‌లో ఫిన్‌ పెయిర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించిన ఇతగాడు అందులో ఇది ముంబై కేంద్రంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. వివిధ రకాలైన వ్యాపారులను వారి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారం చేశాడు.

నగరానికి చెందిన ఓ వ్యాపారి (39) ఆన్‌లైన్‌లో వచ్చిన ఈ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. తనకు రుణం కావాలంటూ ఆ ప్రకటనలో పొందపరచగా...అది చూసిన నాగరాజు 2023 జూన్‌లో సదరు వ్యాపారిని సంప్రదించాడు. వ్యాపారి పూర్వాపరాలు, రుణం అవసరాలను తెలుసుకున్న నాగరాజు భారీ మొత్తం తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆపై వివిధ రకాలైన రుసుముల పేరు చెప్పి ఆ ఏడాది నవంబర్‌ నుంచి దశల వారీగా రూ. కోటీ 55 లక్షలు స్వాహా చేశాడు.

అప్పటి నుంచి త్వరలో రుణం మంజూరై ఖాతాలో పడుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఎట్టకేలకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.సతీష్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఇతడు ఇలాంటి నేరాలు ఇంకా ఏవైనా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)