Breaking News

హైబ్రిడ్‌ ఫండ్స్‌కి ఆదరణ

Published on Mon, 04/28/2025 - 06:25

న్యూఢిల్లీ: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి 2024–25లో రూ.1.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2023–24లో వచ్చిన పెట్టుబడులు రూ.1.45 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం తగ్గాయి. అయినప్పటికీ గణనీయంగా పెట్టుబడులు రావడం గమనించొచ్చు. అంతేకాదు, ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలతో (ఫోలియోలు)పాటు, హైబ్రిడ్‌ ఫండ్స్‌ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే వృద్ధి చెందడం గమనార్హం. ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 1.35 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.56 కోట్లకు పెరిగాయి.

 ఇక వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.7.23 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏయూఎంలో 22 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతులు పెరిగిపోవడం, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి పరిణామాలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు నిపుణులు చెబుతున్నారు. 

హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయని తెలిసిందే. హైబ్రిడ్‌ పథకాల్లో డెట్‌ పెట్టుబడులకు ఉండే రక్షణ దృష్ట్యా అవి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినట్టు ట్రేడ్‌జినీ సీవోవో త్రివేష్‌ తెలిపారు. అచ్చమైన ఈక్విటీలతో పోలి్చతే ఈ పథకాల్లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదన్నారు. 2022–23లో ఇదే విభాగం నికరంగా రూ.18,813 కోట్లను కోల్పోవడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)