Breaking News

అమెరికా దెబ్బకు చైనా ఔట్‌?

Published on Sat, 04/12/2025 - 14:11

అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.

145 శాతం వరకు సుంకాలు

చైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్‌ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్‌, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.

ఎగుమతులపై తీవ్ర ప్రభావం

సుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్‌ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్‌ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్‌ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.

ఆర్థిక పరిణామాలు

అమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్‌టైల్‌ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

తగ్గిన జీడీపీ అంచనా

అమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.

చైనా ప్రతిస్పందన

చైనా యూఎస్‌ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్‌టైల్‌ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.

ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..

యూఎస్‌పై చైనా రివర్స్‌ సుంకాలు

అమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్‌ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)