Breaking News

క్యాష్యూను క్యాష్‌ చేసుకునేలా టారిఫ్‌లు

Published on Sat, 04/05/2025 - 08:54

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలకు ప్రతికూలంగా మారితే, ఇంకొన్ని విభాగాలకు అవకాశంగా పరిణమించింది. భారత్‌లోని జీడిపప్పు వ్యాపారులకు ఈ సుంకాలు అమెరికాలో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు మార్గాన్ని చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌కు పెద్దమొత్తంలో జీడీపప్పు ఎగుమతి చేస్తున్న వియత్నాంపై 46 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 26 శాతం సుంకానికి లోబడి భారతీయ జీడిపప్పు అక్కడి మార్కెట్‌లో పోటీపడే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

చాలా ఏళ్లుగా వియత్నాం యూఎస్‌ జీడిపప్పు మార్కెట్‌లో ఆధిపత్యం సాగిస్తోంది. అమెరికా దిగుమతుల్లో సుమారు 90 శాతం వాటా వియాత్నాందే కావడం విశేషం. భారత్‌ వాటా ఈ విభాగంలో చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000-8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కొత్త టారిఫ్ విధానాలు అమెరికాలో భారతీయ జీడిపప్పు మార్కెట్‌ను విస్తరించుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. వియత్నాం కంటే భారత్‌పై విధించిన సుంకాలు 20 శాతం తక్కువగా ఉండడం ఇందుకు కారణం. దాంతో యూఎస్‌ మార్కెట్లో ఇండియా క్యాష్యూ చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది అక్కడి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు

ప్రాసెసింగ్‌ సామర్థ్యాలు పెంచుకోవాలి..

ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్‌ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ఇండియాపై తక్కువ టారిఫ్‌ ఉండడం ఇందుకు కారణం. అమెరికా జీడిపప్పు మార్కెట్‌లో వాటాను పెంచుకునేందుకు ఇండియాతో పాటు తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలు కూడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి’ అని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)