Breaking News

అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు

Published on Sun, 10/19/2025 - 09:21

భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ 'అరట్టై' (Arattai)కు ఆదరణ పెరుగుతోంది. లక్షలమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే కొందరికి అరట్టై అంటే ఏమిటో బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.

అరట్టై అనేది తమిళ పదం. దీనిని ఏ భాషలో ఎలా పిలవాలి అనే విషయాన్ని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్వీట్ చేసారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో అరట్టైకు తెలుగులో 'మాటలాట' (మాట్లాడుకోవడం) అని సూచించారు.

జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై మెటా యాజమాన్యంలోని వాట్సాప్'కు ప్రత్యర్థిగా వచ్చింది. ఇందులో వాట్సాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు.

అరట్టై.. వాట్సప్‌ మధ్య తేడాలు
●అరట్టై ఆండ్రాయిడ్ టీవీలకు, ఆ స్థాయి పరికరాలకు యాక్సెస్‌ అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.

●అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్‌లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యూ' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.

●అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.

ఇదీ చదవండి: ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)