ఫోన్ నంబర్ల మాస్కింగ్ ఒక్కటే సరిపోతుందా?

Published on Thu, 07/30/2026 - 11:15

భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆమూలాగ్రం మార్చేసి కోట్లాది మంది దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇప్పుడు ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అదే.. వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యత. దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం అమలు దశలోకి వచ్చిన నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేమెంట్ యాప్‌లు, భాగస్వామ్య బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబరు 4 నాటికి యూజర్ల మొబైల్ నంబర్లను పూర్తిస్థాయిలో ప్రదర్శించకుండా మాస్కింగ్ చేయాలి (కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించాలి). అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న ఫోన్ నంబర్ ఆధారిత యూపీఐ ఐడీలకు స్వస్తి చెప్పి యూజర్ నేమ్ ఆధారిత వర్చువల్‌ పేమెంట్‌ అడ్రెస్‌(వీపీఏ)లను కొత్త వినియోగదారులకు డిఫాల్ట్‌గా కేటాయించాలని ఆదేశించింది.

స్త్రీల భద్రత.. సత్వర నివారణ చర్యలు

చిల్లర వర్తకులకు లేదా అపరిచితులకు క్యూఆర్‌ కోడ్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు వినియోగదారుల (ముఖ్యంగా మహిళల) ఫోన్ నంబర్లు బహిర్గతమై, వేధింపులు, సైబర్ బెదిరింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్‌పీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యూఆర్‌ కోడ్ లావాదేవీలలోనూ, పీర్‌2పీర్‌ బదిలీల్లోనూ వ్యక్తిగత నంబర్ ప్రదర్శన ఆగిపోయి ప్రాథమిక స్థాయి ప్రైవసీ రక్షణ లభిస్తుంది.

ఇది ఒక భాగం మాత్రమే!

  • ఫోన్ నంబర్లను దాచడం అనేది డిజిటల్ గోప్యత అనే పెద్ద సమస్యలో ఒక చిన్న పరిష్కారం మాత్రమేనని రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నంబర్ దాచినా చెల్లింపు నిర్ధారణ స్క్రీన్‌పై ఖాతాదారుడి పూర్తి పేరు, బ్యాంక్ వివరాలు కనిపించడం వల్ల వ్యక్తిగత గుర్తింపును సులభంగా కనుగొనే అవకాశం ఇంకా మిగిలే ఉంది.

  • థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌లు వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన, లొకేషన్, లావాదేవీల నమూనాలను ఎంతవరకు సేకరిస్తున్నాయి? ఆ డేటాను ప్రకటనల సంస్థలకు ఎలా విక్రయిస్తున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

  • సెప్టెంబరు 4 కల్లా బ్యాంకింగ్ సిస్టమ్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం, కోట్ల మంది వినియోగదారులకు కొత్త వీపీఏ పద్ధతులపై అవగాహన కల్పించాల్సి ఉంది.

వేగం, సౌలభ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టించిన యూపీఐ ఇప్పుడు విశ్వసనీయత, డేటా ప్రైవసీ అనే పరీక్షను ఎదుర్కొంటోంది. కేవలం నంబర్లు దాచడానికే పరిమితం కాకుండా డేటా మినిమైజేషన్ (అవసరమైనంత డేటా మాత్రమే సేకరించడం) సూత్రాన్ని వర్తింపజేస్తూ సమగ్ర సైబర్ భద్రతా చట్రాన్ని నిర్మించినప్పుడే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నిజమైన రక్షణ లభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)