Breaking News

తదుపరి టెక్ హబ్‌గా మరో నగరం

Published on Sat, 10/11/2025 - 14:53

బెంగళూరు భారతదేశంలోని టెక్ రాజధానిగా ప్రసిద్ధి చెందినప్పటికీ కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరు కొత్త టెక్, స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు దీన్ని భవిష్యత్ ఆవిష్కరణల కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బెంగళూరు వైద్యుడు డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్‌ వేదికగా వెలసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి.

ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ పోస్ట్‌ ప్రకారం.. ‘మంగళూరులో ఇప్పటికే 25,000 మంది టెక్ నిపుణులు ఉన్నారు. గొప్ప ప్రతిభ, మెరుగైన జీవన నాణ్యత, సరసమైన గృహాలు, ఉన్నత విద్యా సంస్థలు, అద్భుతమైన బీచ్‌ ఉంది’ అని తెలిపారు. ఈ పోస్ట్‌కు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మద్దతు తెలియజేస్తూ..‘మంగళూరు కేవలం టెక్ హాట్ స్పాట్ మాత్రమే కాదు. యువ పారిశ్రామికవేత్తలు, సమతుల్య జీవితం కోసం చూసే నిపుణులకు ఆదర్శ గమ్యస్థానం. ఇది ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇది ఆసియాలో ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానంగా మారుతుంది’ అన్నారు.

అయితే, బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందిస్తూ..‘మంగళూరు తదుపరి సిలికాన్ కోస్ట్ కావడానికి ముందు చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ప్రమాదకరమైన రన్‌వే కాకుండా మెరుగైన అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం’ అని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

కొందరు మంగళూరు విమానాశ్రయం ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం మాదిరిగా సౌకర్యవంతంగా, నగరానికి దగ్గరగా ఉందని చెప్పారు. అయితే, టెక్ హబ్‌గా మారిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమా అని డాక్టర్ దీపక్ ప్రశ్నించారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.32 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించించినట్లు నెటిజన్లు తెలిపారు. ఇది మునుపటి రికార్డును మించిపోయిందని, ప్రస్తుతం రన్‌వేను 150 మీటర్లు పొడిగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)