Breaking News

రూ.1 లక్షతో రూ.100 కోట్లు సంపాదించిన నటుడు.. ఎలాగంటే..

Published on Sat, 08/23/2025 - 14:29

బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌, అయేషా ష్రాఫ్‌ దంపతులు 15 సంవత్సరాల్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.100 కోట్ల కార్పస్‌ను క్రియేట్‌ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పెట్టుబడి పెట్టేందుకు చాలామందే ఆసక్తి చూపిస్తారు. కానీ సరైన టైమింగ్‌, ఇన్వెస్ట్‌ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వీరు నిరూపించారు. వ్యాపార చతురతతో జాకీష్రాఫ్‌ గతంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పెద్ద మొత్తంలో కార్పస్‌ జనరేట్‌ అయింది. అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఎలా అంతమొత్తంలో సంపద సృష్టించారో తెలుసుకుందాం.

1995లో భారత్‌ తీసుకున్న ఆర్థిక సరళీకృత నిర్ణయాలవల్ల చాలా అంతర్జాతీయ కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. అందులో భాగంగా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా తన టీవీ ఛానెల్‌ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జాకీష్రాఫ్‌, అయేషా ష్రాఫ్‌తో కలిసి ఏడుగురు సభ్యుల బృందంతో కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా మారారు. కొత్త కంపెనీ కదా ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావు లేకుండా తాము నమ్మిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో టెలివిజన్‌ బిజినెస్‌కు ప్రజలు ఆసక్తి చూపుతారనే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. క్రమంగా కంపెనీ ఎదిగి తాము అప్పట్లో ఇన్వెస్ట్‌ చేసిన రూ.1లక్ష 15 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లు అయినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు

ఎందులో పెట్టుబడి పెట్టినా సరైన టైమింగ్‌, ఇన్వెస్ట్‌ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని గమనించాలి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)