రూ.83 లక్షల కోట్లకు డిజిటల్‌ ఎకానమీ

Published on Thu, 10/03/2024 - 09:32

భారత్‌ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్‌ క్యాపిటల్‌ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్‌ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.

నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్‌ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్‌) ప్రకారం..భారత్‌ డిజిటల్‌ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.

ఇదీ చదవండి: ‘కాల్‌ చేసి స్కామ్‌ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్‌ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)