Breaking News

ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధాని

Published on Mon, 09/23/2024 - 10:03

ప్రముఖ కంపెనీల సీఈఓలు, అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో సమావేశం అయ్యారు. ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అంటే అమెరికా(ఏ), ఇండియా(ఐ) అని చెప్పారు. మూడు రోజుల యూఎస్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం రాత్రి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు చెందిన ప్రముఖులను కలిసి మాట్లాడారు. భారతదేశంలోని అవకాశాల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ‍ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ విధానాలు పాటిస్తున్నాం. ఏదైనా ఒక దేశం విధించిన నియమాలను అనుసరించి డిజిటల్‌ ప్రపంచం నడవదు. నిత్యం అది మారుతూ ఉంటుంది. భారత్‌, అమెరికా కలిసి సాంకేతిక అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఏఐ అంటే అమెరికా, ఇండియా’ అని తెలిపారు.

వైట్ హౌస్ విడుదల చేసిన ఉమ్మడి ఫాక్ట్ షీట్ ప్రకారం..ఐబీఎం సంస్థ ఇండియాకు చెందిన  ఐరావత్ సూపర్ కంప్యూటర్‌కు మద్దతుగా ఏఐ సేవలిందిచేలా ఒప్పందం చేసుకుంది. అధునాతన సెమీకండక్టర్ ప్రాసెసర్‌లకు సంబంధించిన రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సహకారాన్ని మెరుగుపరిచేలా ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత క్వాంటం మిషన్‌కు ఎంతో ఉపయోగపడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో శనివారం సెమీకండక్టర్లకు సంబంధించి ఆర్‌ అండ్‌ డీ విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీన్ని గ్లోబల్‌ ఫౌండరీస్‌ ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!

అమెరికా, ఇండియా మధ్య నవంబర్‌ 2023లో ‘ఇన్నోవేషన్ హ్యాండ్‌షేక్’ కార్యక్రమంలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల్లోని అభివృద్ధి అంశాలపై ఇరు దేశాలకు చెందిన నాయకులు చర్చించారు. సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్‌ సమావేశంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఏఎండీ సీఈఓ లిసా సు చైర్, తదితరులు పాల్గొన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)