వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

Published on Wed, 12/10/2025 - 04:04

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.

ధనవంతుడిని $లో కొలుస్తారు.
సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.
ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.
ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.

ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.

ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)