బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..

Published on Wed, 10/16/2024 - 13:37

బంగారాన్ని కొందరు ఆభరణంగా వినియోగిస్తే, ఇంకొందరు పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దాంతో పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే రిటైల్‌ షాపుల్లో తీసుకునే బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అయినా అంత పెద్దషాపు నిర్వహిస్తున్నవారు ఎందుకు మోసం చేస్తారని అనుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నడుపుతున్న షాపుల్లో ఈ మోసాలు తక్కువే. సరైన నిబంధనలు పాటించనివారు మాత్రం బంగారం స్వచ్ఛత విషయంలో వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో బంగారం నాణ్యతను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.

బంగారం నాణ్యతను క్యారట్లలో కొలుస్తారు. బంగారం కొనేందుకు షాపులోకి వెళ్లిన వెంటనే నచ్చిన ఆభరణాలు ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు షాపు సిబ్బంది 24, 22, 18 క్యారట్ల బంగారం అని చెబుతూ తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 18 క్యారట్‌ నాణ్యత కలిగిన బంగారం చూపుతూ..అది 22 క్యారట్‌ గోల్డ్‌ అని చెబుతుంటారు. అది నమ్మి చివరకు 22 క్యారట్‌ బంగారం ధర చెల్లిస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలు ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బంగారు ఆభరణాలపై ముందుగా ప్రభుత్వ అధీనంలోని బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) సంస్థ హాల్‌మార్క్‌ ఉందో పరిశీలించాలి. దీంతోపాటు ఆభరణంపై కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. వాటిని బట్టి అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.

  • 24 క్యారట్‌ బంగారం: 999 అనే సంఖ్య ఉంటుంది.

  • 22 క్యారట్‌: 916

  • 18 క్యారట్‌: 750

  • 14 క్యారట్‌: 583

  • 10 క్యారట్‌: 417 అనే నంబర్‌ ఉంటుంది.

ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!

24 క్యారట్‌ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్‌ బంగారంలో 8.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. 18 క్యారట్‌ బంగారంలో 25 శాతం ఇతర పదార్థాలతో కల్తీ చేస్తారు. 14 క్యారట్‌-41.7 శాతం, 10 క్యారట్‌-58.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు.​

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)