Breaking News

వాట్సాప్‌లో ఆధార్‌ డౌన్‌లోడ్‌.. ఈజీగా చేసుకోండిలా..

Published on Thu, 09/25/2025 - 12:32

ఆధార్‌ కార్డు (Aadhaar ) అన్నది దేశంలో అతి ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఆర్థిక వ్యవహారాలతో పాటు రోజువారీ కార్యకలాపాల్లోనూ ఆధార్‌ కార్డు అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, సేవలను పొందటానికి ఇది చాలా కీలకం. ఇంతటి ముఖ్యమైన ఆధార్‌ కార్డును భౌతికంగా వెంటపెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఆ అవసరం కూడా లేదు.

ఆధార్‌ కార్డు యాక్సెస్‌ను సులభతరం చేయడానికి, ప్రజలు తమ ఆధార్‌ను నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా డౌన్లోడ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్‌ అధికారిక మైగవ్‌ (MyGov) హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా అందుబాటులో ఉంది. దీంతో వివిధ యాప్‌లు, వెబ్‌సైట్‌లకు వెళ్లే పని లేకుండా వేగంగా ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఇప్పటి వరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్‌ డౌన్‌లోడ్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..

  • మీ ఫోన్ పై మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు (+91-9013151515)ని సేవ్ చేయండి.

  • వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" వంటి గ్రీటింగ్ మెసేజ్‌ పంపండి.

  • చాట్ బాట్ ద్వారా షేర్‌ చేసిన ఎంపికల నుండి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి.

  • మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ అందించండి.

  • వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.

  • వెరిఫికేషన్‌ పూర్తియన తర్వాత, చాట్ బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.

  • ఆధార్‌ను ఎంచుకుంటే కార్డు పీడీఎఫ్ వెర్షన్ నేరుగా వాట్సాప్‌లో వస్తుంది.

నోట్‌: ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్‌లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.

ఇదీ చదవండి: బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్‌!

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)