Breaking News

ఇలా చేస్తే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! ఖర్చు ఎంతవుతుందో తెలుసా?

Published on Thu, 05/18/2023 - 17:42

IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్‌సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత  ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బుక్ చేసుకునే విధానం
ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్‌సైట్‌ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.

ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు.

(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..)

ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)