Breaking News

ఐదేళ్లలో 50 శాతం ఉద్యోగాలు ఉఫ్‌!

Published on Fri, 05/30/2025 - 14:32

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో జాబ్‌మార్కెట్‌లో దీని ప్రభావం భారీగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంతకు ముందు ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉంటుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 50 శాతం ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేయబోతుందని చెప్పారు. దాంతో నిరుద్యోగ రేటు 20 శాతానికి చేరుకుంటుందని అమోది అంచనా వేస్తున్నారు.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ ఇప్పటికే టెక్నాలజీ, ఫైనాన్స్, లా, కన్సల్టింగ్.. వంటి చాలా రంగాల్లోని ఉద్యోగులకు విఘాతం కలిగిస్తోంది. సంక్లిష్టమైన డేటా విశ్లేషణ, కంటెంట్ సృష్టి, చట్టపరమైన పరిశోధన చేసేలా మెషిన్ లెర్నింగ్ నమూనాలు, సాంప్రదాయకంగా ఇంటర్న్‌లు, జూనియర్ ఉద్యోగులు నిర్వహించే పనులను ఏఐ భర్తీ చేస్తోందని అమోది తెలిపారు. ఫలితంగా కంపెనీలు కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం తగ్గించాయని చెప్పారు. ముఖ్యంగా గతంలో వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా ఉన్న ఉద్యోగాల స్థానంలో రిక్రూట్‌మెంట్‌ గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. కొవిడ్‌ ముందు పరిణామాలతో పోలిస్తే పెద్ద టెక్‌ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ నియామకాలు 50% పడిపోయాయని తెలిపారు. ఆటోమేషన్ వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరిస్తుండడం, వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుండడంతో ఏఐ కీలకంగా మారిందన్నారు.

మౌనం తగదు..

భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నోరుమెదపడం లేదని అమోది చెప్పారు. ముఖ్యంగా యూఎస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ అంశంపై మౌనంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. చైనాతో జరుగుతున్న ఏఐ రేసులో ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో విధాన నిర్ణేతలు నష్టాలను అంగీకరించడానికి వెనుకాడుతున్నారని అంచనా వేశారు. ఏఐ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోస్తుందని, అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని అమోది అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రం

ఏం చేయాలంటే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రభావాన్ని తగ్గించడం మానేసి ఈ మార్పులకు సిద్ధంగా ఉండడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అమోది కోరారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్‌కు నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా రీస్కిల్లింగ్‌, అప్ స్కిల్ ప్రోగ్రామ్‌ల అవసరాన్ని నొక్కి చెప్పారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)