Breaking News

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలకు ఏమైంది?

Published on Fri, 09/27/2024 - 07:47

న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్‌ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.

కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం.  

పట్టణాల వారీగా.. 
» పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 
» ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ. 
» బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి.  
» కోల్‌కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 
» చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి.  

హైదరాబాద్‌లో ధరల పెరుగుదల అధికం 
ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్‌ నివేదిక తెలిపింది.  

పండుగల కాలంలో డిమాండ్‌ 
‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్‌–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్‌ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్‌–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)