హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు

Published on Fri, 06/09/2023 - 04:22

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్‌కతాలో 11 శాతం, అహ్మదాబాద్లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా టాప్‌–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్‌హెచ్‌బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్‌ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?)

క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్‌–50లో అత్యధికంగా గాంధీనగర్‌లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్‌ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది.

 ఇదీ చదవండి: 1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు

మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)