Breaking News

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..

Published on Sat, 04/19/2025 - 09:33

సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.

ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.

ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)