Breaking News

పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి 

Published on Fri, 11/21/2025 - 05:47

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్‌ టూరిజం బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్‌కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్వహించారు. 

ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు. 

లైసెన్స్‌ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్‌ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ డొమెస్టిక్‌ టూర్‌ ఆపరేటర్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్‌ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్‌ గైడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)