Breaking News

హైదరాబాద్‌లో ఇంటి సెంటిమెంట్‌..

Published on Sat, 05/31/2025 - 11:58

ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్‌ బ్రిక్స్‌: ది పల్స్‌ ఆఫ్‌ హోం బయింగ్‌’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.      – సాక్షి, సిటీబ్యూరో

రియల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..

ఇల్లు కొనాల్సిందే..
సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్‌గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్‌వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్‌లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్‌కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్‌లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి.  

సొంతిల్లు ఎందుకంటే.. 
సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..
ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్‌కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్‌లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. 

సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్‌ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్‌గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్‌ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)