Breaking News

స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్‌ చరిత్ర

Published on Thu, 08/10/2023 - 23:02

బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్‌ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది.  

1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్‌ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!)

భారతీయ బ్యాంకింగ్ చరిత్ర
వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి  1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ. 

600లకు పైగా బ్యాంకులు
స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది. 

మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా  1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)