Breaking News

రూ. 3,000 కోట్ల డీల్‌.. హెచ్‌యూఎల్‌ చేతికి మినిమలిస్ట్‌!

Published on Sat, 01/04/2025 - 07:15

చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ మినిమలిస్ట్‌పై (Minimalist) ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ (Hindustan Unilever) దృష్టి పెట్టింది. 2020లో ప్రారంభమైన కంపెనీ తాజాగా సిరీస్‌ ఏలో భాగంగా యూనిలీవర్‌ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్‌ ఇండియా నుంచి పెట్టుబడులు సమీకరించింది.

కాగా.. డైరెక్ట్‌ టు కన్జూమర్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ మినిమలిస్ట్‌ కొనుగోలుకి హెచ్‌యూఎల్‌ చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. రూ. 3,000 కోట్ల విలువలో ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మినిమలిస్ట్‌లో మెజారిటీ వాటాను హెచ్‌యూఎల్‌ సొంతం చేసుకోనున్నట్లు అభిప్రాయపడ్డాయి. బిజినెస్‌ వృద్ధి, విస్తరణకు వీలుగా వివిధ వ్యూహాల అమలుతోపాటు, అవకాశాలను అన్వేషిస్తుంటామని హెచ్‌యూఎల్‌ ఈ సందర్భంగా తెలియజేసింది.

మెటీరియల్‌ డెవలప్‌మెంట్‌ ఉంటే చట్టప్రకారం తగినవిధంగా సమాచారాన్ని వెల్లడిస్తామని తెలియజేసింది. గతేడాది(2023–24) మినిమలిస్ట్‌ రూ. 347 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం రెట్టింపై రూ. 11 కోట్లకు చేరింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)