Breaking News

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన  మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు

Published on Sun, 06/11/2023 - 11:49

ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి  లగాన్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్  లాంటి బాలీవుడ్‌ సినిమాలతో పాటు  దేశంలో రెండవ అతిపెద్ద  నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్‌లో 1977లో ఎన్‌టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది.  

1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ  ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్‌ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.1258 కోట్లను రాబట్టడమే  కాదు ఆస్కార్‌ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్‌  క్రియేట్‌ చేసింది. 

అయితే కన్నడ మూవీల జాబితాలో  వసూళ్లకు సంబంధించిన  టాప్‌ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్‌-2.  100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్‌ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ  వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్‌ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్‌)

అత్యధిక వసూళ్లు సాధించిన టాప్  ఇండియన్‌ మూవీస్‌

దంగల్
అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్‌ కంపెనీ సీఈవో)

బాహుబలి-2 ద కంక్లూజన్‌
రెండు భాగాలుగా  టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్‌  బాహుబలి-2  రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ 
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌  ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌  అలియా భట్ నటించింది

కేజీఎఫ్‌-2
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్‌ హిట్‌ అయిన కేజీఎఫ్‌కి  సీక్వెల్‌గా  కేజీఎఫ్‌2 తెరకెక్కింది.ఈ మూవీలో  2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్‌ లావణ్య ఎంగేజ్‌మెంట్‌: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?)

బజరంగీ భాయీజాన్
సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు.

పీకే
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  తదితరులు నటించారు.

సీక్రెట్ సూపర్ స్టార్
చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు.

---- పోడూరి నాగ ఆంజనేయులు

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)