Breaking News

బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి

Published on Thu, 05/29/2025 - 20:39

భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. భారతీయులు బంగారాన్ని ఆభరణాలుగా, పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావించి.. ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దేశంలో బంగారు ఆభరణాల వినియోగం 2026 ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 12-14 శాతం గణనీయంగా పెరుగుతుందని ''ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్'' (ICRA) వెల్లడించింది.

2025 ఆర్ధిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి, 2026లో ధరలు పెరుగుతూనే ఉంటాయని ICRA తెలిపింది. సాధారణంగా గోల్డ్ రేటు పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. కానీ భారతదేశంలో శుభకార్యాలకు, శుభదినాలకు బంగారం కొనుగోలు పెరుగుతోంది. ధరలు మరింత పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా బంగారం ఆభరణాల వినియోగం అదే తరహాలో పెరుగుతుంది. ధరలు కూడా గత ఆర్ధిక సంవత్సరం కంటే.. 20 శాతం ఎక్కువగా ఉన్నాయి.

ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..

2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాలలో గోల్డ్ బార్లు, నాణేల వినియోగం వరుసగా 17 శాతం,  25 శాతం పెరిగింది.దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల చాలామంది.. పసిడి కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ బార్లు, నాణేలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)