Breaking News

స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది

Published on Tue, 03/04/2025 - 05:01

జమ్‌షేడ్‌పూర్‌: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. వ్యయ నిర్వహణ, సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కోవాలన్నారు. టాటా స్టీల్‌ వ్యవస్థాపకుడు జేఎన్‌ టాటా 186వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని అందుపుచ్చుకునే విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు ప్రభుత్వం, విధానాల రూపంలో కంపెనీకి సాయం అవసరమన్నారు. 

‘‘విస్తరణ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలి. సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు కొనసాగించాలి. ఉత్పాదకతను పెంచుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించాలి’’అని టాటా స్టీల్‌ విషయంలో కర్తవ్యబోధ చేశారు. టారిఫ్‌లపై కొనసాగుతున్న చర్చను ప్రస్తావించగా.. సుంకాల గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదంటూ, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని సూచించారు. 

టారిఫ్‌లు అన్నవి ప్రభుత్వం విధించే సుంకాలని, విదేశీ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు వీటిని చెల్లిస్తాయన్నారు. సెమీకండక్టర్‌ చిప్‌ల విషయంలో భారత్‌ స్వావలంబన సాధించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రశేఖర్‌ వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాలు చిప్‌లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసమే అసోం, గుజరాత్‌లో టాటాగ్రూప్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)