Breaking News

ఈవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. వచ్చేస్తోంది విడా ఉబెక్స్!

Published on Tue, 02/10/2026 - 20:13

హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్‌కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.

విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.

సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?

హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్‌షిప్‌లు, విడా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)