Breaking News

బైక్ ప్రేమికులకు షాక్.. మళ్ళీ పెరిగిన హీరో మోటోకార్ప్ ధరలు!

Published on Sat, 07/01/2023 - 10:16

Hero MotoCorp Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ' హీరోమోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు తమ వాహనాల ధరలను మరో సారి పెంచింది. పెరిగిన ధరలు జులై 03 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, హీరో మోటోకార్ప్ ఈ సారి సగటున 1.5 శాతం ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల వేరియంట్, మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత పెరిగింది అనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

గతంలో..
హీరో మోటోకార్ప్​ మూడు నెలలకు ముందు కూడా తమ వాహనాల ధరలను పెంచింది. కాగా మళ్ళీ ఇప్పుడు మరో సారి పెంచినట్లు ప్రకటించింది. ముడి సరకుల ఖర్చులతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరల పెరుగుల జరిగినట్లు తెలిసింది. అయితే కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం కలిగించడానికి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్​ ప్రొగ్రామ్​లను అందించనుంది.

(ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం!)

రానున్న పండుగ సీజన్‌లో వాహనాల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫర్స్ అందించడం జరుగుతుంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఎక్స్​ట్రీమ్​, స్ప్లెండర్ మొదలైన వెహికల్ ధరలు మరో రెండు రోజుల్లో పెరగనున్నాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)