Breaking News

బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!

Published on Thu, 06/04/2026 - 20:35

ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) తన గోల్డ్ ఆధారిత పథకాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఈ నిర్ణయం.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాలకు వర్తిస్తుంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని ఫండ్ హౌస్ స్పష్టం చేసింది.

'హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్'లో పెద్ద పెట్టుబడిదారులు.. నేరుగా ఫండ్ హౌస్ ద్వారా పెట్టే పెట్టుబడులు జూన్ 8, 2026 నుంచి స్వీకరించబడవు. అంటే. ఒక్కసారిగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం తాత్కాలికంగా నిలిపివేశారన్నమాట. ప్రత్యేకంగా రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులపై ఈ నిబంధన వర్తిస్తుంది.

అదే విధంగా 'గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్'లో ఒక PANకి నెలకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులు అనుమతిచడం జరుగుతుంది. జూన్ 5, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లకు ఈ పరిమితి అమలులోకి వస్తుంది. అయితే.. ఈ పథకాలకు సంబంధించి ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు కొనసాగుతాయి.

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. బంగారం దిగుమతులపై పెరిగిన పన్నులు. కాగా.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి దిగుమతులపై ప్రభావవంతమైన పన్నును 9.2% నుంచి 18.4%కి పెంచింది. ఈ మార్పు మే 13, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి: టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)