Breaking News

ఆస్తి అమ్మేసిన HDFC బ్యాంక్ మాజీ చీఫ్‌ ఫ్యామిలీ

Published on Sun, 04/26/2026 - 10:39

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

లాభదాయకమైన విక్రయం
ఈ అపార్ట్‌మెంట్‌ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.

మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.

ఓంకార్ 1973 ప్రత్యేకత
ముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.

అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్‌లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్‌కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.

ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం..

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)