Breaking News

ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్‌

Published on Sun, 08/03/2025 - 15:57

ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్‌ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.

విజయకుమార్‌ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్‌ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.

2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక నివేదిక తెలిపింది.

ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్‌యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.

2016లో హెచ్‌సీఎల్‌టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్‌ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్‌సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.

👉ఇది చదివారా? కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు.. సీఎఫ్‌వో కీలక ప్రకటన

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)