Breaking News

హెచ్‌సీఎల్‌ చేతికి జర్మన్ కంపెనీ: 279 మిలియన్‌ డాలర్ల డీల్‌

Published on Thu, 07/13/2023 - 11:40

ముంబై: దేశీయ మూడో  అతిపెద్ద  ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌  జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల  సంస్థ ఎసాప్‌  గ్రూప్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్‌ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్‌సిఎల్‌టెక్  యూకే  అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని  సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 

అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో  ఈ డీల్‌ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్‌లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్‌లో విస్తరణకు ఈ  కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌:లైసెన్స్‌ ఉండాల్సిందే!)

హెచ్‌సీఎల్‌  ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి.

ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. 

ఇతర విశేషాలు 
కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి 
క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు.  
జూన్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది. 
ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 16.3 శాతంగా నమోదైంది. 

   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)