కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్‌డే విషెస్‌.. ఎవరికో తెలుసా?

Published on Sat, 01/27/2024 - 18:07

ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్‌డే విషెస్‌ చెప్పారు. కాగ్నిజెంట్‌ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్‌లోని చైన్నైలో కాగ్నిజెంట్‌ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్‌.రవికుమార్‌ సీఈవోగా ఉన్నారు.

కాగ్నిజెంట్‌ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్‌డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్‌కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు.
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)