Breaking News

తెరపైకి మళ్లీ H-1B వీసా వివాదం!

Published on Sat, 07/11/2026 - 08:01

అమెరికాలో హెచ్1బీ వీసా అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ భారీ లేఆఫ్ కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఎక్స్‌బాక్స్‌ విభాగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సంస్థ అమెరికన్ల ఉద్యోగాలను, విదేశీయులతో భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్స్‌బాక్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు సుమారు 3,200 మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్స్‌బాక్స్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పునర్వ్యవస్థీకరణ అవసరమని ఉద్యోగులకు వివరించారు.

అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీయులా?
అయితే.. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఈ ఏడాది 2,273 హెచ్1బీ వీసా ఉద్యోగుల నియామకాలకు అనుమతి లభించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారని ఆరోపణలు మరింత బలపడ్డాయి.

ఈ అంశంపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన రైలీ మూర్ తీవ్రంగా స్పందించారు. పెద్ద టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసి, అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులకు ఇస్తున్నాయని ఆరోపించారు. అందుకే హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌బాక్స్‌లో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత విదేశీ ఉద్యోగుల కోసం వీసాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.

సోషల్ మీడియాలో చర్చ
సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అమెరికా ఉద్యోగాలు క్రమంగా విదేశీయులకు వెళ్లిపోతున్నాయని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఎక్స్‌బాక్స్‌ సీఈఓ ఆశా శర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు.

మైక్రోసాఫ్ట్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఉద్యోగుల తొలగింపులు పూర్తిగా వ్యాపార అవసరాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని, హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ లేఆఫ్‌లలో ప్రభావితమయ్యారని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఉద్యోగుల వీసా హోదాతో ఈ నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు