Breaking News

అక్కడ వర్క్‌ ఫ్రమ్‌ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన

Published on Sat, 09/02/2023 - 17:23

ప్రతిష్టాత్మక జీ20 అంతర్జాతీయ సదస్సును ఈ ఏడాది భారత్‌ నిర్వహిస్తోంది. దేశ రాజధానిలో సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో ఈ సమ్మిట్‌ జరగబోతోంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. జీ20 సదస్సు కోసం యూఎస్‌ ప్రెసిడెంట్ జో బైడెన్ సెప్టెంబర్ 8న భారత్‌కు వస్తున్నారు.

జీ20 సమ్మిట్‌కు ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయి. సన్నాహకాల్లో భాగంగా న్యూఢిల్లీకి దక్షిణంగా ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రమైన గురుగ్రామ్ బహుళజాతి కంపెనీలకు వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) సలహా జారీ అయింది. ఢిల్లీలో సమ్మిట్‌ను సజావుగా నిర్వహించేందుకు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షలలో భాగంగా ఈ వర్క్‌ ఫ్రం హోం అడ్వయిజరీ జారీ చేశారు.  ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు ఆయా రోజుల్లో స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు.

 

న్యూఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు
సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. న్యూ ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్దిష్ట ట్రాఫిక్ నిబంధనలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో మెట్రో, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 48  మినహా న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) పరిధికి వెలుపల ఉన్న ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)