CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
జీఎస్టీఏటీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
Published on Thu, 09/25/2025 - 09:05
వ్యాపారవర్గాలు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ మధ్య వివాదాల సత్వర పరిష్కారానికి ఉపయోగపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా జీఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ (gstat)ని ప్రారంభించారు. వ్యాపార సంస్థలు ఈ పోర్టల్లో తమ కేసులను ఫైల్ చేయొచ్చు.
డిసెంబర్ నుంచి వాటిపై విచారణ ప్రారంభమవుతుంది.
భారత్లో సంస్కరణలు పురోగమించే తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman.) చెప్పారు. మరింత మెరుగుపడాలన్న దృఢ సంకల్పాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి ఈ పోర్టల్ను ఉపయోగించుకోవాలని వ్యాపార సంఘాలకు ఆమె సూచించారు. అప్పీళ్ల ఫైలింగ్కి వ్యవధిని 2026 జూన్ 30 వరకు పొడిగించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!
జీఎస్టీఏటీ ట్రిబ్యునల్ ముఖ్యాంశాలు
ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 24, 2025
పన్ను చెల్లింపుదారులు, అధికారుల మధ్య పెండింగ్లో ఉన్న 4.83 లక్షలకు పైగా జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం దీని ఉద్దేశం.
డిజిటల్ ఫైలింగ్ ద్వారా జీఎస్టీఏటీ పోర్టల్లో పన్ను చెల్లింపుదారులు అప్పీళ్లను దాఖలు చేయవచ్చు. కేసులను ట్రాక్ చేయవచ్చు. వర్చువల్ విచారణలకు హాజరు కావచ్చు.
దీని ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీలో ఉంటుంది.
దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
Tags : 1