Breaking News

ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలకు ఊరట

Published on Wed, 01/28/2026 - 16:33

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలు అందించే ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు అందించే కన్సల్టెన్సీ సేవలను ‘సేవల ఎగుమతి’(Export of Services) గానే పరిగణించాలని, వాటికి జీఎస్టీ రీఫండ్‌ పొందే హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో జీఎస్టీ చట్టంలోని ‘ఇంటర్మీడియరీ’ (మధ్యవర్తిత్వ) సేవలపై చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు తెరపడింది.

హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

జస్టిస్‌ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. గ్లోబల్‌ అపర్చునిటీస్‌ అనే ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ సంస్థకు జీఎస్టీ రీఫండ్‌ మంజూరు చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

కోర్టు తీర్పులో అంశాలు..

‘విదేశీ వర్సిటీలకు అందించే సేవలు స్వతంత్రమైనవి. వీటిని కేవలం మధ్యవర్తిత్వ సేవలుగా చూడలేం. విద్యార్థులు భారత్‌లో ఉన్నారనో లేదా పారితోషికం విదేశీ కరెన్సీలో వస్తుందనే కారణాలతో ఈ సేవలను 'ఇంటర్మీడియరీ సేవలు'గా పరిగణించడం సాధ్యం కాదు. విద్యార్థులు వర్సిటీల్లో చేరిన తర్వాతే కమిషన్ అందవచ్చు, కానీ అది సంస్థ అందించే సేవల ఎగుమతి స్వభావాన్ని మార్చదు’ అని న్యాయస్థానం పేర్కొంది.

ఐజీఎస్‌టీ చట్టంపై స్పష్టత

ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చట్టంలోని సెక్షన్‌ 2(13) ప్రకారం 'ఇంటర్మీడియరీ' నిర్వచనాన్ని ఈ కేసులో లోతుగా విశ్లేషించారు. సదరు కన్సల్టెన్సీ కేవలం విద్యార్థులకు, వర్సిటీలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించడం లేదని, అది ఒక స్వతంత్ర సేవగా పరిగణించబడుతుందని దిల్లీ హైకోర్టు ఇదివరకే తేల్చింది. ప్రభుత్వం దీన్ని ఏజెంట్ సేవగా అభివర్ణించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీలకే పరిమితం కాకుండా విదేశాలకు సేవలు ఎగుమతి చేసే ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. కొన్ని సంస్థలకు నిలిచిపోయిన కోట్లాది రూపాయల జీఎస్టీ రీఫండ్‌లు విడుదల కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.

ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)